విద్యుత్‌ సంక్షోభం..! ఇలా స్పందించిన కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి

కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ క్రమంగా విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది.. ఇదే సమయంలో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో… థర్మల్‌ విద్యుత్‌ ఉప్పత్తికి అంతరాయం తప్పదని.. ఇది దేశంలో విద్యుత్‌ సంక్షోబానికి దారితీయొచ్చనే వార్తలు గుప్పుమంటుచున్నాయి.. అయితే, దీనిపై ఇప్పటికే కేంద్ర విద్యుత్‌ శాఖ.. ఆ సంక్షోభానికి నాలుగు కారణాలు ఉన్నాయని ప్రకటించింది.. మరోవైపు.. ఈ ఎపిసోడ్‌పై స్పందించిన కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌.. విద్యుత్‌ సంక్షోభం ఎదుర్కోబోతున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన ఆయన.. విద్యుత్‌ సంక్షోభంపై అనవసర భయాందోళనలు సృష్టించబడ్డాయి.. కానీ, అలాంటి ఇబ్బంది లేదన్నారు. కేవలం గెయిల్, డిస్కం సంస్థల మధ్య సమాచారలోపం వల్లే ఇలాంటివి ఏర్పడుతున్నాయని స్పష్టం చేశారు.

దేశరాజధాని ఢిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరాకు ప్రమాదం పొంచిఉందన్న ఆందోళన నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ సంక్షోభం వస్తుందంటూ అనవసర ఆందోళనలు సృష్టించారు.. కానీ, దేశంలో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు.. ఇక, ఎట్టిపరిస్థితుల్లోనూ గ్యాస్‌ సరఫరా కూడా తగ్గదని స్పష్టం చేసిన ఆయన.. విద్యుత్‌ అవసరమైన వారు కోరితే.. సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విద్యుత్‌ సంక్షోభానికి కారణమయ్యే సరఫరా, వినియోగం మధ్య ఎలాంటి సమస్య లేదన్నారు ఆర్‌కే సింగ్.. విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన గ్యాస్‌ అందించాలని ఇప్పటికే గెయిల్‌ ఆదేశించినట్టు తెలిపారు.

-Advertisement-విద్యుత్‌ సంక్షోభం..! ఇలా స్పందించిన కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి

Related Articles

Latest Articles