రెండు డోసుల మ‌ధ్య గ్యాప్‌పై కేంద్రం క్లారిటీ..

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం దేవ‌శ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం రోజురోజుకూ వేగం పుంజుకుంటుంది.. అయితే, క‌రోనా ఫ‌స్ట్ డోస్‌.. సెకండ్ డోస్‌కు మ‌ధ్య ఉండాల్సిన గ్యాప్‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి.. వైద్య నిపుణులకు కూడా ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉన్నాయి.. ఈ స‌మ‌యంలో.. కొంద‌రికి ఆందోళ‌న‌కు కూడా క‌లుగుతోంది.. దీంతో.. కరోనా డోసుల మధ్య నిడివి గురించి క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం.. రెండు డోసుల మ‌ధ్య గ్యాప్ గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని సూచించిన కేంద్రం.. నిడివి తగ్గింపు కోసం ముందుగా భారత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఓ అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపింది.. ఇప్ప‌టికిప్పుడు రెండు డోసుల మధ్య నిడివిని తగ్గించాల్సిన అవసరం లేద‌ని స్ప‌ష్టం చేసిన కేంద్రం.. ఇవన్నీ ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయాలు. రెండు డోసుల మధ్య సమయాన్ని పెంచినప్పుడు మేం ఒకే డోసు తీసుకున్న వారు ఎదుర్కోబోయే ప్రమాదాలను కూడా పరిగణలోకి తీసుకున్న‌ట్టు తెలిపింది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో అనేక మందికి ఫ‌స్ట్ డోస్ ల‌భించింద‌న్నారు నీతీ అయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ వీకే పాల్.. దీంతో వైరస్ నుంచి కొంత‌మంది ర‌క్షణ పొందగలిగార‌ని.. ఇటువంటి పరిస్థితుల మధ్య మనం సమతుల్యం సాధించాల‌ని.. ఈ విష‌యాల‌పై ప్రజల్లో చర్చ జరగాల్సిందే అన్నారు.. ఇక‌, ఈ విషయంలో నిపుణులు తగిన వేదికల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు వీకే పాల్..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-