లాక్‌డౌన్ అవ‌స‌రం లేదు… కానీ…

ఢిల్లీలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇప్ప‌టికే ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు. వీకెండ్ క‌ర్ప్యూ అమ‌లు జ‌రుగుతున్న‌ది. శ‌ని, ఆదివారాల్లో పూర్తిస‌స్థాయిలో క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తిరోజూ కేసులు 30 శాతానికి పైగా పెరుగుతున్నాయి. శ‌నివారం రోజున 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఈరోజు అంత‌కంటే ఎక్కువ‌గా న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్టు స్వ‌యంగా ముఖ్య‌మంత్రే తెలియ‌జేశారు. లాక్‌డౌన్ విధించే అవ‌కాశం లేద‌ని, ఇప్ప‌టికే సామాన్యుడు అనేక ఇబ్బందులు ప‌డుతున్నాడ‌ని, వీకెండ్ క‌ర్ఫ్యూ, నైట్ క‌ర్ఫ్యూలతో పాటు నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నామ‌ని అన్నారు.

Read: న్యూయార్క్‌లో రిల‌య‌న్స్‌ భారీ పెట్టుబ‌డులు…

ప్ర‌తి ఒక్క‌రూ వారి జాగ్ర‌త్త‌ల్లో వారు ఉండాల‌ని, మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక‌దూరం పాటించ‌డం వంటివి చేయాల‌ని, క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని కేజ్రీవాల్ తెలిపారు. స‌సోమ‌వారం రోజున ఢిల్లీ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ దీనిపై స‌మావేశం కానుంద‌ని, స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్ర‌స్తుతం తాను క‌రోనా నుంచి కోలుకున్నాన‌ని, వ‌చ్చే నెల‌లో ఉత్త‌రాఖండ్‌లో జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌ప్ప‌కుండా పాల్గొంటాన‌ని అన్నారు. ఇక ఈరోజు 22 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న‌ది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.

Related Articles

Latest Articles