లాక్‌డౌన్ వార్త‌లు వైర‌ల్… ఇలా క్లారిటీ ఇచ్చారు

క‌రోనా సెకండ్ వేవ్ కంట్రోల్ చేయ‌డానికి మ‌రోసారి దేశ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారంటూ వ‌స్తున్న‌వార్త‌లు వైర‌ల్ గా మారిపోయాయి.. లాక్‌డౌన్ బాధ్య‌త మాది కాదు.. కేసుల తీవ్ర‌త‌, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆయా రాష్ట్రాలే నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని ఇప్ప‌టికే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా స్ప‌ష్టం చేశారు. అయినా ఈ వార్త‌లు ఆగ‌డంలో.. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ నుంచి లాక్‌డౌన్ విధిస్తార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.. అయితే, దీనిపై ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది.. అవ‌న్నీ వ‌దంతులేన‌ని స్ప‌ష్టం చేసింది.. మే 3వ తేదీ నుంచి 20వ తేదీ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తార‌ని వ‌స్తున్న వార్త‌లు ఫేక్ అని తేల్చింది.. లాక్‌డౌన్ విధిస్తామ‌ని కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది పీఐబీ. కాగా, కోవిడ్ క‌ట్ట‌డికి కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌గా.. మ‌రికొన్ని మినీ లాక్‌డౌన్‌, ఇంకా కొన్ని వీకెండ్ లాక్‌డౌన్‌, చాలా రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూ ప్ర‌క‌టించినా.. అది రాష్ట్రాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిన విష‌యం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-