స్మృతీ ఇరానీకి చేదు అనుభవం… అతిథిగా ఆహ్వానించిన షోకే ‘నో ఎంట్రీ’

ప్రముఖ నటి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి చేదు అనుభవం ఎదురైంది. అతిథిగా ఆహ్వానించిన షోకే ‘నో ఎంట్రీ’ అనడంలో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది ఆమె. ఇటీవలే రచయిత్రిగా మారిన స్మృతి తన బుక్ ను ప్రమోట్ చేసుకోవడానికి పాపులర్ టెలివిజన్‌ కపిల్ శర్మ కామెడీ షోలో అతిథిగా పాల్గొనాల్సి ఉంది స్మృతి. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ కోసం ఆమె లొకేషన్ సెట్ కు చేరుకోగా, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆమెను లోపలకు అనుమతించడానికి నిరాకరించాడట. ఈ షోకు తాను గెస్ట్ అని చెప్పినప్పటికీ దీని గురించి మాకెలాంటి సమాచారం లేదు మేడం… సారీ అంటూ ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టారట. ఈ పరిణామంతో స్మృతి వెనుదిరగక తప్పలేదు. అయితే ఇదంతా సెట్ లోపల బిజీగా ఉన్న కపిల్ శర్మ అండ్ టీంకు అస్సలు తెలియదట.

Read Also : “లైగర్” దూకుడు… అప్డేట్స్ కోసం మేకర్స్ సన్నాహాలు

తీరా జరిగిన విషయం తెలిశాక సెట్ లో గందరగోళం నెలకొంది. అంతేకాదు షూటింగ్ కు ప్యాకప్ కూడా చెప్పేశారు. అంతేకాదు స్మృతి ఇరానీకి కపిల్ శర్మ అండ్ టీం జరిగిన దానికి క్షమించమని కోరారట. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కపిల్ శర్మ షో మేకర్స్ కావాలనే ఇలా చేశారని, స్మృతి ఇరానీ ఒక రాజకీయ వేత్త, నటి కూడా… ఆమె గురించి తెలియనివారు ఉండరు… అలాంటిది ఆమెను ఇలా సెట్ లోకి అనుమంతించకుండా ఎలా ప్రవర్తిస్తారు అంటూ మండిపడుతున్నారు ఆమె అభిమానులు. అయితే త్వరలో ప్రసారం కానున్న షోలో అసలేం జరిగింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చి ఈ పుకార్లను చెక్ పెట్టాలని కపిల్ శర్మ షో మేకర్స్ భావిస్తున్నారట.

Related Articles

Latest Articles