కోవిడ్ 19 సెస్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం

కోవిడ్ 19 సెస్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం

కోవిడ్ 19 అన్ని రంగాలను కుదిపేసింది.. కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది.. దీంతో, దేశాన్ని మన్ని ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే పన్నులు తప్పవనే ప్రచారం సాగింది.. రాబడి పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌-19 సెస్‌ విధించేందుకు సిద్ధమైందనే ఊహాగానాలు వినపడ్డాయి. కానీ, ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నాయి అధికార వర్గాలు.. కోవిడ్‌-19 సెస్‌ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, యూనియన్ బడ్జెట్‌కు ముందు కూడా ఇలాంటి ప్రచారం సాగింది.. ఆ తర్వాత కూడా ఎక్కడో బాదేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగాయి.. అసలే కరోనా తీవ్రంగా దెబ్బకొట్టింది.. ఈ తరుణంలో అదనపు సెస్‌లు, వడ్డింపులు ఏంటి? అని మండిపడ్డారు సామాన్యులు.. బతకడమే కష్టంగా మారితే.. ఈ బాదుడేంటి? అని ప్రశ్నించారు. కానీ, అలాంటిది ఏమీ లేదంటూ సామాన్యుడికి ఊరట కలిగిస్తోంది కేంద్రం. మరి.. మునుముందు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-