ఆగమ్యగోచరంగా నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది భవిష్యత్…

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 67 మంది సిబ్బంది భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్ పై సిబ్బంది పని చేస్తున్నారు. ఏప్రిల్ 30 తో గడువు ముగిసిన ఇప్పటివరకు కొనసాగింపు ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వం నుండి రెన్యువల్ ఉత్తర్వులు వస్తేనే జీజీహెచ్ లో విధులు నిర్వహిస్తాం అంటున్నారు. రెన్యువల్ చేయకుంటే మే నెల వేతనం కూడా రాదంటున్నాయి ఆసుపత్రి వర్గాలు. సిబ్బంది రెన్యువల్ పై కలెక్టర్, డిఎంఈ కి విన్నవించామంటున్న ఆసుపత్రి వర్గాలు… సిబ్బంది వెళ్లిపోతే కరోనా చికిత్స కష్టం అంటున్నారు. ఉత్తర్వులు రాకుంటే వైద్య విధాన పరిషత్ కు సరెండర్ చేయనున్నారు ఆస్పత్రి సూపరింటెండెంట్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-