కార్పొరేటర్ భర్త వీరంగం… కూలి పై విచక్షణ రహితంగా దాడి

నిజామాబాద్ నగరంలో 34వ డివిజన్ కార్పొరేటర్ భర్త మల్లేష్ గుప్తా వీరంగం సృష్టిస్తున్నారు. వాటర్ వర్క్ చేస్తున్న అడ్డా కూలి పై విచక్షణ రహితంగా దాడి చేసారు. కాలితో తన్ని పిడి గుద్దు లు కురిపించారు కార్పొరేటర్ భర్త, నుడా డైరెక్టర్ మల్లేష్ గుప్తా. రాములు అనే అడ్డా కూలిని చితక బాధిన వీడియో వైరల్ అవుతుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఘటన పై ఫిర్యాదు చేసింది బాధితురాలు. తన అనుమతి లేకుండా కుళాయి కనెక్షన్ ఇవ్వడం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపింది. అయితే ఈ దాడి ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రజా సంఘాలు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నాయి.

Related Articles

Latest Articles