సర్టిఫైడ్‌ కార్ రేసర్ గా అందాల భామ!

‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్.ఆర్.ఐ. భామ నివేతా పేతురాజ్ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలలో నటించింది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ ‘రెడ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ‘విరాటపర్వం’తో పాటు మూడు, నాలుగు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆ మధ్య ఓసారి నివేతా కార్ రేసింగ్ అంటే తనకెంతో ఇష్టమనే విషయాన్ని అభిమానులకు తెలియచేసింది.

Read Also : ఈషా ఈజ్ బ్యాక్… నిర్మాతగా న్యూ ఇన్నింగ్స్! నటిగా సెకండ్ ఇన్నింగ్స్!

అంతేకాదు… ఆ రేసింగ్ లో మరో అడుగు ముందుకు వేసి తాజాగా ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో లెవెల్ 1లో సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. మొమెంటమ్ – స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్ సంస్థ నుండి నివేతా పేతురాజ్ ఈ సర్టిఫికెట్ ను పొందింది. దానికి సంబంధించిన ఫోటోలతో పాటు కార్ రేసింగ్ లో పాల్గొన్న వీడియోనూ నివేత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలుగులోనే కాకుండా పలు తమిళ చిత్రాల్లోనూ నివేతా నటిస్తోంది. వెంకట్ ప్రభు రూపొందిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘పార్టీ’లోనూ, ఎ. ఎల్. విజయ్ ఫిమేల్ సెంట్రిక్ మూవీ ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’లోనూ నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తోంది. మరి ఇప్పుడు కార్ రేసర్ గా సర్టిఫికెట్ ను కూడా పొందింది కాబట్టి ఆమెను దృష్టిలో పెట్టుకుని కార్ రేసింగ్ బేస్డ్ స్టోరీస్ ను ఎవరైనా సిద్ధం చేస్తారేమో చూడాలి.

Nivetha Pethuraj becomes a certified car racer- News
-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-