కేంద్ర కేబినెట్‌లోకి జేడీ-యూ.. నాలుగు మంత్రి పదవులు..?

కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైంది… రేపు సాయంత్రం 6 గంటలకు కేబినెట్‌ విస్తరణ జరగనుంది.. ప్రధానంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఈ సారి కేబినెట్‌లో చోటు దక్కనుంది… ఇక, ఇప్పటికే బీహార్‌లో కలిసి పనిచేస్తున్నాయి బీజేపీ-జేడీయూ.. ఇప్పుడు కేంద్ర కేబినెట్‌లోకి వచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు బీహార్‌ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్‌ కుమార్? అయితే, తమకు నాలుగు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.. ఈ అంశం పై జనతా దళ్-యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు ఆర్.సి.పి. సింగ్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించారు నితీష్… అన్ని అంశాలు, బీజేపీతో మాట్లాడిన సింగ్.. తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.. కేంద్ర మంత్రివర్గంలో నాలుగు మంత్రి పదవులు కావాలని కోరుతున్నజేడీయూ.. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని చెబుతోంది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు సీట్లు దక్కినా.. ఆ పార్టీ అధినేత అయినటువంటి నితీష్‌ కుమార్‌నే సీఎంను చేశారు ప్రధాని మోడీ. మరి.. ఇప్పుడు కేంద్ర కేబినెట్‌లో ఎన్ని బర్త్‌లు దక్కుతాయే చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-