నీతి ఆయోగ్ ర్యాకింగ్స్ : టాప్ లో నిలిచిన ఏపీ

స్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్‌ ర్యాంకులు విడుదల చేసింది. పలు అంశాల్లో మంచి పనితీరు కనపరిచినందుకు ఏపీకి ర్యాంకులు ప్రకటించింది నీతి ఆయోగ్‌. నీతి ఆయోగ్ తాజా ర్యాకింగ్స్ లో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఏపీకి చోటు దక్కింది. 2020-21 సంవత్సరానికి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ లో 72 స్కోర్ తో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. గతేడాదితో పోలిస్తే 5 పాయింట్లు అధికంగా సాధించింది ఏపీ. 75 స్కోర్ తో తొలి స్థానంలో కేరళ నిలవగా.. క్లీన్‌ ఎనర్జీ విభాగంలో ఏపీకి టాప్‌ ర్యాంక్ లభించింది. ఓవరాల్‌గా ఫ్రంట్‌ రన్నర్‌ రాష్ట్రాల జాబితాలో ఏపీ నిలిచింది. 2018 తో పోలిస్తే గణనీయంగా ఏపీ పనితీరు మెరుగుపడింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-