భార్యపై నితిన్ ‘నెగెటివ్’ కామెంట్స్… వీడియో వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన భార్యపై చేసిన ‘నెగెటివ్’ కామెంట్స్ కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నితిన్ తన తాజా పోస్ట్ లో కేక్ కోస్తూ మొదటిసారి తన భార్య నెగెటివ్ కావాలని కోరుకుంటున్నాను అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే నితిన్ కింద కేక్ కోస్తూ ఉండగా, ఆయన భార్య పైన ఇంట్లో ఉన్న కిటికీ దగ్గర నిలబడి చూస్తోంది. అలా ఎందుకంటే నితిన్ భార్యకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆమె ఇప్పుడు ఒంటరిగా ఐసోలేషన్ లో ఉంటోంది. అయితే ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కోసిన నితిన్, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా నితిన్ ఆమె నెగెటివ్ కావాలని కోరుకున్నారు.

Read Also : ఏపీ సీఎం జగన్ కు ఆర్జీవీ హెచ్చరిక

కేక్ కోసిన వీడియోను పోస్ట్ చేస్తూ “కోవిడ్ కు బారియర్స్ ఉంటాయి కానీ, లవ్ కి కాదు… హ్యాపీ బర్త్ డే మై లవ్… లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నెగటివ్ కావాలని కోరుకుంటున్నాను” అంటూ భార్యకు బర్త్ డే విషెస్ తెలిపాడు నితిన్. ఆయన పోస్ట్ చూసిన అభిమానులు నితిన్ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక మరోవైపు సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో కరోనా రేపుతున్న కలకలం కారణంగా సెలెబ్రిటీల అభిమానులు ఆందోళకు గురవుతున్నారు.

Related Articles

Latest Articles