బన్నీ డైరెక్టర్ కి… బంపర్ ఆఫర్ ఇచ్చిన నితిన్!

రాఘవేంద్ర రావు మొదలు రామ్ గోపాల్ వర్మ దాకా, రాజమౌళి మొదలు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాకా రకరకాల ఇమేజ్ ఉన్న దర్శకులతో చకచకా సినిమాలు చేసేస్తుంటాడు నితిన్. ఇంతలా వేరియేషన్ మెయింటైన్ చేయటం నిజంగా మరే హీరోకి సాధ్యం కాదని చెప్పుకోవాలి. అయితే, కరోనా లాక్ డౌన్ టైంలోనూ ఈ యాక్టివ్ స్టార్ జోరు తగ్గించలేదు. 2020, 2021 సంవత్సరాల్లో ఇప్పటికే మూడు సినిమాలు ముగ్గురు డిఫరెంట్ డైరెక్టర్స్ తో పూర్తి చేసి… విడుదల చేశాడు. నెక్ట్స్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ‘మేస్ట్రో’ సినిమాతో రాబోతున్నాడు. అంటే, ఇతర హీరోలు ఒక్క సినిమా రిలీజ్ చేయటానికి తంటాలు పడుతుంటే నితిన్ నాలుగు ఎంటర్టైనర్ లు పూర్తి చేశాడన్నమాట!

సినిమాల సంఖ్యే కాదు ఎక్కువ మంది దర్శకులతో పని చేసేందుకు ఉత్సాహం చూపే నితిన్ మరో ప్రాజెక్ట్ కి పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. ‘నా పేరు సూర్య’తో డైరెక్టర్ అయిన స్టార్ రైటర్ వక్కంతం వంశీ ప్రాజెక్ట్ కి నితిన్ సై అన్నాడట. ఆయన బన్నీతో తీసిన పాట్రియాటిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాక చాలా గ్యాపే వచ్చింది. అయితే, తాజాగా నితిన్ కు వక్కంతం చెప్పిన కథ నచ్చటంతో ఆగస్ట్ లోనే సినిమా ప్రారంభించబోతున్నారట.

అంతా అనుకున్నట్టు జరిగితే నితిన్, వక్కంతం వంశీ మూవీ నెక్ట్స్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే థియేటర్స్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇంకా అధికారిక ప్రకటన రాని వీరిద్దరి సినిమాలో హీరోయిన్ ఎవరన్నది కూడా త్వరలోనే తెలియవచ్చు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-