ఓటీటీ వైపు నితిన్ ‘మాస్ట్రో’ చూపు!

గత యేడాది విడుదల కావాల్సిన నితిన్ చిత్రాలు కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ కావడంతో ఈ యేడాది విడుదలయ్యాయి. అలా ‘చెక్’తో పాటు ‘రంగ్ దే’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ అయ్యియి. కానీ వాటికి ఆశించిన స్థాయి విజయం మాత్రం దక్కలేదు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నితిన్ ‘మాస్ట్రో’ చిత్రం మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెన్స్ కనిపిస్తున్నాయి. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడు. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమన్నా కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేశ్ నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం కేవలం ఏడు రోజుల షూటింగ్ మాత్రం బాలెన్స్ ఉందట. దానిని జూన్ రెండో వారం నాటికి పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. విశేషం ఏమంటే… ఈ సినిమా ఓటీటీ హక్కులకు చక్కని డిమాండ్ ఏర్పడిందట. ఓ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో నితిన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఆఫర్ వైపు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. అయితే… దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విశేషం ఏమంటే… కథ రీత్యా కూడా ‘మాస్ట్రో’ను ఓటీటీలో విడుదల చేస్తేనే బెటర్ అనే భావన ఫిల్మ్ నగర్ లో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే… హిందీలో ఇలాంటి బోల్డ్ టైప్ మూవీస్ థియేట్రికల్ రిలీజ్ అయినా అక్కడ చూస్తారు కానీ, తెలుగువారు ఎంతవరకూ వీటిని అంగీకరించి, ఆదరిస్తారనే చిన్న సందేహం లేకపోలేదు. ఆ రకంగా చూసినప్పుడు థియేటర్లలో కంటే… ఓటీటీలో విడుదలైతేనే ‘మాస్ట్రో’కు సరైన గుర్తింపు, ఆదరణ లభిస్తాయన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. మరి నితిన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-