‘మాస్ట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్: రీమేక్ కష్టాలను చెప్పిన నితిన్

హీరో నితిన్ నటించిన ‘మాస్ట్రో’ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోంది.. ప్రమోషన్ లో భాగంగానే నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ క్రమంలో నితిన్ మాట్లాడుతూ రీమేక్ కష్టాలను పంచుకున్నారు. అంధాదున్ సినిమా బాగా నచ్చింది. నటనకు స్కోప్ ఉన్న సినిమా కావడంతో రిస్క్ తీసుకోవాలి అనిపించింది. దర్శకుడు మేర్లపాక గాంధీ దీనికి కరెక్ట్ డైరెక్టర్ గా భావించాను. ఈ సినిమాకు ఆయన చాలా కష్టపడ్డాడు. ఉన్నది ఉన్నట్టు తీస్తే ఏం తీశాడురా? అని అంటారు. మార్పులు చేర్పులు చేస్తే.. సోల్ లేదు చెడగొట్టారు అంటారు. కానీ ఈ దర్శకుడు మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీశారు.

హిందీ సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో మన సినిమా కూడా అంత బాగుందని అనుకుంటారు. టబు పాత్రకు చాలా మందిని అనుకున్నాం. కానీ తమన్నా ఒప్పుకుంటుందా? లేదా? అనుకున్నాం.. మాస్ట్రో ఓటీటీలో వస్తుందంటే చాలా బాధపడ్డాను.. కానీ అనుకోని పరిస్థితుల్లో ఓటీటీలోకి తీసుకురావాల్సి వస్తోంది.ఇక ఓ పాత్రకు మాత్రం మంగ్లీ సరిపోతుందని మా నాన్న అన్నారు. కానీ నాకు అంతగా నమ్మకం రాలేదు. ఆమె సింగర్ కదా? అని అనుకున్నాను. కానీ, ఇకపై ఆమె సింగర్‌గా మాత్రమే కాకుండా.. యాక్టర్‌గా కూడా బిజీగా అవుతుంది’ అని నితిన్ అన్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-