సత్యదేవ్ “తిమ్మరుసు” రైట్స్ వారికే…!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు : అసైన్మెంట్ వాలి”. ఈ చిత్రం 21 మే 2021 న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను నిర్వాణ సినిమాస్ సొంతం చేసుకుంది. అయితే ఈ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయని తెలియలేదు. కాగా ఈ కరోనా నేపథ్యంలో ఇంకా థియేటర్స్ రీఓపెన్ కాలేదు. అయినప్పటికీ ఈ సినిమాను జూలైలో థియేటర్లలో విడుదల చేయనున్నాము అంటూ మేకర్స్ ప్రకటించడం గమనార్హం.

Read Also : “ఐరన్ మ్యాన్” ఇంట్లో విషాదం

ఇక ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణ సంస్థలపై మహేష్ కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాంచరన, ప్రియాంక జవాల్కర్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. 2019లో వచ్చిన కన్నడ చిత్రం ” బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని “ని రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇది 2017లోని కొరియన్ మూవీ “న్యూ ట్రయల్” ఆధారంగా రూపొందించబడింది. ఈ యంగ్ హీరో తెలుగులో “గాడ్సే”, “గుర్తుందా శీతాకాలం” వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవలే సత్యదేవ్ కు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-