నిమ్స్ ఆసుపత్రి కీలక నిర్ణయం.. డాక్టర్లకు ఉచితంగా కోవిడ్ ట్రీట్మెంట్

నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లకు కోవిడ్ ట్రీట్మెంట్ ఉచితంగా అందించేందుకు నిమ్స్ ఆసుపత్రి నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా హెల్త్ కేర్ సిబ్బందికి కోవిడ్ ట్రీట్మెంట్ కి నిమ్స్ లో ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తుల వచ్చాయి. జూనియర్ డాక్టర్లు కూడా నిన్నటిదాకా సమ్మె లో ప్రధానమైన డిమాండ్ గా కూడా చేర్చారు. ఎట్టకేలకు నిమ్స్ ఆస్పత్రి వర్గాలు డాక్టర్లకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. అందుకుగాను ఒక RMO తో పాటు పల్మానోలజీ మెడిసిన్ నోడల్ ఆఫీసర్ గా నియమించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-