కోవిడ్ తో నటి నిక్కి తంబోలి సోదరుడు మృతి

కోవిడ్ -19 సెలెబ్రిటీలు, సాధారణ జనం అనే తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ మహమ్మారి కారణంగా ఇండియాలో లక్షలాది మంది మరణిస్తున్నారు. ఇంకా చాలా మంది ఆసుపత్రులలో వైరస్ తో పోరాడుతున్నారు. కరోనాతో పలువురు సెలెబ్రిటీలు తమకు ఇష్టమైన వారిని పోగొట్టుకున్నారు. తాజాగా టాలీవుడ్ నటి, బిగ్ బాస్ 14 ఫేమ్ నిక్కి తంబోలి సోదరుడిని కరోనా బలి తీసుకుంది. నిక్కీ సోదరుడు, 29 ఏళ్ల జతిన్ తంబోలి ఈ ఉదయం కరోనావైరస్ తో పోరాడుతూ కన్నుమూశారు. తన సోదరుడి మరణానికి సంతాపం తెలుపుతూ నిక్కీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆవేదన కలిగిస్తోంది. నిక్కి తన సోదరుడి ఫోటోలను పంచుకుంటూ “ఈ ఉదయం దేవుడు నీ పేరు పిలవబోతున్నాడని మాకు తెలియదు… జీవితంలో మేము నిన్ను ఎంతో ప్రేమించాము మరణంలో మేము కూడా అదే చేస్తాము. నిన్ను కోల్పోవడం మా హృదయాన్ని కలచి వేసింది. నువ్వు మాకు అందమైన జ్ఞాపకాలు మిగిల్చావు. మేము నిన్ను చూడలేకపోయినా నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు. మమ్మల్ని నడిపిస్తావు. నీ మరణంతో మన ఫ్యామిలీ చైన్ విడిపోయింది. కానీ దేవుడు మనల్ని ఒక్కొక్కరిగా పిలుస్తున్నప్పుడు ఆ చైన్ మళ్లీ లింక్ అవుతుంది. నిన్ను ఎప్పటికీ మరచిపోము… ప్రేమిస్తూనే ఉంటాము. నీ ఆత్మకు శాంతి కలగాలి. ఐ మిస్ యు డాడా” అంటూ తన సోదరుడి మృతిపై ఎమోషనల్ అయ్యింది నిక్కీ.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-