గన్ గురి పెట్టి భారీ దొంగతనం… షాక్ లో హీరోయిన్

బాలీవుడ్ నటికి జీవితంలో మర్చిపోలేని షాకింగ్ ఘటన ఎదురైంది. ఆమెకు గన్ గురి పెట్టి ఏకంగా లక్షల్లో దోపిడీ చేశారట దొంగలు. ఈ షాకింగ్ ఘటన నుంచి ఆమె ఇంకా తేరుకోలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… నటి నికితా రావల్ బాలీవుడ్ తో పాటు దక్షిణ భారతీయ సినిమాలలో మంచి ఆర్గనైజర్, పెర్ఫార్మర్‌గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు ఆమె “మిస్టర్ హాట్ మిస్టర్ కూల్”, “ది హీరో – అభిమన్యు”, “గరం మసాలా”, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం “క్యూట్ కామినా” వంటి సినిమాల్లో నటించింది. తాజా సమాచారం ప్రకారం నికితా రావల్ గత వారం దేశ రాజధానిలో తన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది రాబర్స్ ఆమెను తుపాకీతో ఏడు లక్షలకు పైగా దోచుకెళ్లారు. ఆ తర్వాత ఆమె భయంతో ఢిల్లీ నుంచి ముంబై వచ్చేసిందట.

Read Also : బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు : నాని

నికితా రావల్ మాట్లాడుతూ “రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. నేను అత్త ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ఇన్నోవా అతి వేగంగా వచ్చి నా వాహనాన్ని ఆపివేసింది. ఆపై నలుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు కారు నుండి బయటకు వచ్చి నాకు తుపాకీని చూపించారు. నా దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఇచ్చేయమని బెదిరించారు” అని చెప్పుకొచ్చింది. నికితా రావల్ చెప్పినదాని ప్రకారం ఆ దొంగలు ఆమె ఉంగరాలు, డైమండ్ లాకెట్టు, గడియారం, చెవిపోగులు, నగదును దోచుకున్నారు. మొత్తం వాటి విలువ సుమారు రూ.7 లక్షలట. ఈ షాకింగ్ ఘటనతో తాను చాలా డిస్టర్బ్ అయ్యానని నటి తెలిపింది. ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఆమె సరిగ్గా తినలేకపోతోందట. అలాగే నిద్ర పట్టడం లేదని వాపోయింది. ప్రస్తుతం ఈ విషయం గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Related Articles

Latest Articles

-Advertisement-