భారీ రేటుకు ‘కార్తికేయ 2’ రైట్స్

‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు చందూ ముండేటి, హీరో నిఖిల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే షూటింగ్ దశలోనే వున్నా ఈ సినిమాకి అప్పుడే భారీ ఆఫర్ వచ్చిందట.. తాజా సమాచారం మేరకు ఈచిత్ర శాటిలైట్ హక్కులు ఓ ప్రముఖ ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కూడా అమ్ముడయ్యాయట. మొత్తంగా శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ 20 కోట్ల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే నిఖిల్ చిత్రానికి ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఆధ్యాత్మిక అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై వారు చాలా నమ్మకంగా ఉండటంతో అడ్వాన్స్ కూడా ముట్టచెప్పారని తెలుస్తోంది. ఇందులో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-