చాలా గ్యాప్ వచ్చింది.. ఆ ఎంపీ ప్రెగ్నెన్సీతో సంబంధం లేదు

పాపులర్ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2019 నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తని ఆమె వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. అయితే తాజాగా నుస్రత్ జహాన్ ప్రెగ్నెన్సీ అంటూ ప్రచారం జరిగింది. త్వరలో ఆమె తల్లి కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనిపై ఆమె ఇంతవరకు స్పందించలేదు. అయితే ఈ ప్రచారంపై ఎదురైనా ప్రశ్నకు నిఖిల్ జైన్ స్పందించాడు. మేము విడిపోయి చాలా రోజులు అవుతుందని పేర్కొన్నాడు. ఆమె ప్రెగ్నెన్సీతో నాకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యలు చేశాడు.
బెంగాలీ చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్ గా నుస్రత్ రాణించింది. 2019లో నుస్రత్ బెంగాల్ లోని బసిర్ హాత్ నియోజకవర్గం నుంచి 3 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచి ఆమె ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-