దాన్ని చూసి కన్నీళ్లు ఆగడం లేదన్న హీరో నిఖిల్.. ట్వీట్ వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన విషయం కానీ, నచ్చని విషయం ఏదైనా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా ‘ట్రిపుల్ ఆర్’ సాంగ్ గురించి నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘ట్రిపుల్ ఆర్’ నుంచి నిన్న ‘జననీ’ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ గురించి ఆయన ట్వీట్ చేశారు ” జనని సాంగ్‌ను ఇప్పటివరకు 20సార్లు చూశాను. చూసిన ప్రతీసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. దేశం మొత్తాన్ని ఎమోషనల్‌గా దగ్గరచేసింది ఈ సినిమా. కీరవాణి, రాజమౌళి..మీరు మరోసారి మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ సినిమాకు మాత్రం దేశవ్యాప్తంగా పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుకొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Related Articles

Latest Articles