చిరంజీవి గారిని అందుకే నేను ఫంక్షన్ కి పిలవను- నిహారిక

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా కన్నా నిర్మాతగానే విజయం సాధించిందని చెప్పాలి. పెళ్లి తరువాత నిహారిక నిర్మాతగా మారి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ నిర్మించిన విషయం తెలిసిందే.. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ విజయాన్ని నిహారిక తమ యూనిట్ తో సెలబ్రేట్ చేసుకొంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆమె తన కుటుంబం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నిర్మాతగా మారారు.. వెబ్ సిరీస్ ఓపెనింగ్ కానీ, ప్రమోషన్స్ కి కానీ చిరంజీవి గారిని ఎందుకు పిలవలేదు అన్న ప్రశ్నకు నిహా సమాధానం చెప్తూ ” చిరు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నేను పిలిస్తే కాదు అనరు.. కానీ, వారు నిత్యం బిజీగా ఉంటారు.. వారిని డిస్ట్రబ్ చేయడం నాకిష్టం లేదు.. అందుకే నేను వారిని ఏ ఫంక్షన్ కి పిలవను అని చెప్పుకొచ్చింది.

ఇక మెగా ఫ్యామిలీకి ఆహా ఉండగా ఈ సిరీస్ ని జీ5 లో స్టీమ్ చేసారు ఎందుకని ప్రశ్నించగా.. అందులో రిలీజ్ చేస్తే సొంత ప్రొడక్షన్.. డబ్బా కొట్టుకుంటున్నారు అంటారు.. బయట దానిలో రిలీజ్ చేస్తే.. సొంతది పెట్టుకొని బయట ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు.. ఏంటండీ ఇది.. నిజం చెప్పాలంటే నా ముందు రెండు సిరీస్ లను జీ5 లో స్ట్రీమింగ్ చేశాను.. అందుకే దీని కూడా అక్కడే రిలీజ్ చేశామని చెప్పుకొచ్చింది.

Related Articles

Latest Articles