అప్పుడు మాల్దీవులు ఇప్పుడు స్పెయిన్

గత సంవత్సరం డిసెంబర్ 9న మెగాడాటర్ నిహారిక కొణిదెల వివాహం చైతన్యతో జరిగింది. కరోనా టైమ్ లోనూ అవుట్ డోర్ లో మెగాహీరోలు, ఇతర చిత్రప్రముఖుల సమక్షంలో ఆ వేడుక జరిగింది. ఆ తర్వాత భర్తతో కలసి హానీమూన్ కి మాల్దీవులకు వెళ్లి వచ్చింది నీహారిక. ప్రస్తుతం నీహారికి భర్తతో కలసి స్పెయిన్ లో విహరిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఆమెకిది రెండో హానీమూన్. పెళ్ళి తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కోసం మూడు ప్రాజెక్ట్ లను సిద్ధం చేస్తోంది నీహారిక.

Read Also : “ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి

అందులో ఒకటి ఇటీవల స్ట్రీమింగ్ అయింది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ పేరుతో స్ట్రీమింగ్ అయిన 5 ఎపిసోడ్ల ఈ వెబ్ సీరీస్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మిగిలిన రెండు ప్రాజెక్ట్స్ కి కొంత టైమ్ ఉండటంతో ఇప్పుడు గ్యాప్ తీసుకుని భర్తతో కలసి స్పెయిన్ విహారయాత్రకి వచ్చింది. రెండు వారాలపాటు సాగే ఈ ట్రిప్ లో యూరోప్ చుట్టి రావాలనుకుంటోంది. ఇక ఈ విహారయాత్రలో భాగంగా నీహారికను రకరకాల యాంగిల్స్ లో కెమెరాతో షూట్ చేస్తున్నాడు ఆమె భర్త చైతన్య. అలా భర్త తీసిన కొన్ని పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వింటర్ లో నిహారిక, చైతన్య రొమాంటిక్ గెట్‌వే అందరినీ ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/stories/highlights/18144450952230065/

Related Articles

Latest Articles