పెళ్లి, సినిమాలు… సమంతను ఉదహరిస్తూ ఓపెన్ అయిన మెగా డాటర్

మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా పెళ్లి, సినిమాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల అలితో సరదాగా అనే కార్యక్రమంలో నిహారిక తన జీవితానికి, సినిమా కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని అలీ నిహారికను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ ఈ రోజుల్లో హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని, దాని వల్ల కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని నిహారిక అన్నారు. అందుకు సమంతను ఉదాహరణగా చెప్పుకొచ్చింది. ఉదాహరణకు సమంతనే తీసుకోండి. పెళ్లి తర్వాత కూడా ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇక తన భర్త చైతన్య జొన్నలగడ్డకు తాను సినిమాల్లో నటించడం ఓకే కాబట్టి తనకు ఓకే అని చెప్పుకొచ్చింది.

Read Also : ఎన్టీఆర్ ట్రస్ట్ వర్సెస్ హనుమ విహారి ఫౌండేషన్… సారీ చెప్పాలంటూ డిమాండ్

ప్రస్తుతం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నానని మెగా కూతురు తెలిపింది. అయితే ఆమె నటనను పూర్తిగా వదులుకోలేదు. తాను సూపర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నానని, దాని వివరాలను ఇప్పుడు చెప్పలేనని నిహారిక తెలిపింది. మెగా బ్రదర్స్‌ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లో తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు ?అని నిహారికను అలీ అడిగాడు. ఆమె “నాన్నా! నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నాకు పెద్దనాన్న, బాబాయి కూడా ఇష్టం” అని చెప్పుకొచ్చింది. ఇక నిహారిక నిర్మించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదల కాగా. దానికి అద్భుతమైన స్పందన వస్తోంది.

Related Articles

Latest Articles