పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే వేరుపడ్డ నిహారిక

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా బయటికి వచ్చిన అమ్మడు.. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని భార్యగా సెటిల్ అయిపోయింది. ఆ తరువాత తన ప్రతిభకు తగ్గట్టు నిర్మాతగా మారి వరుస వెబ్ సిరీస్ లను నిర్మించేస్తోంది. ఇటీవల నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిహారిక తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది.

గతేడాది చైతన్య జొన్నలగడ్డను వివాహమాడిన బ్యూటీ.. తన భర్తతో కలిసి వేరు కాపురం పెట్టినట్లు చెప్పుకొచ్చింది. ” ఇప్పుడు నేను నాన్న వాళ్ళింట్లో కానీ, అత్తవారింట్లో కానీ ఉండడం లేదు.. నేను చైతన్య సొంతంగా ఇల్లు తీసుకొని వేరేచోట ఉంటున్నాం.. కొన్ని రోజులు ఇలాగే ఉండాలని నిర్ణయించుకున్నా.. ఇది నాకు కొత్త అనుభవం.. దగ్గర్లో దగ్గరవారు లేకపోవడం.. ఇప్పటివరకు నేను సింగిల్ గా ఉన్నదే లేదు.. చిన్నప్పటినుంచి ఇంట్లో నన్ను ఎక్కడికి పంపించేవారు కాదు.. అందుకే ఇప్పుడు ఫ్రీగా ఉండాలనుకుంటున్నా.. అందుకు నా భర్త ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడని” చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ విషయం విన్న నెటిజన్లు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నార.. కనీసం పెళ్లైన ఒక ఏడాది వరకైనా అందరు కలిసి ఉంటె బావుండేది..అంటూ సలహాలు ఇచ్చేస్తున్నారు.

Related Articles

Latest Articles