హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్‌ రేసింగ్‌లు…

హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్‌ రేసింగ్‌లు మళ్ళీ ఎక్కువయ్యాయి. నగరంలో పలు చోట్ల రేసింగ్‌లు చేస్తున్నారు యువకులు. బండి నెంబర్‌ ప్లేట్లు తీసి రేసింగ్‌లకు పాల్పడుతున్నారు యువకులు. అయితే లాంగర్‌ హౌస్‌లో ఈ రేసింగ్‌లు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుమీద వేగంగా వెళ్లడంతో తోటి వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. రేసింగ్‌లకు పాల్పడే వారిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీసీ ఫుటేజీల ఆధారంగా బైక్‌ రేసర్లను పట్టుకుంటాం అని పోలీసులు తెలుపుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా లేని ఈ రేసింగ్‌లు మళ్ళీ పెరుగుతున్నాయి. వీరి మితిమీరిన వేగం కారణంగా రోడ్డుపై వెళ్లే మిగితా వాహనదారులు ప్రాధాలకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి త్వరగా పెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

-Advertisement-హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైక్‌ రేసింగ్‌లు...

Related Articles

Latest Articles