గుంటూరు జిల్లాలో నైట్ కర్ఫ్యూ… బార్లు రెస్టారెంట్లు మూసివేత…

గుంటూరు జిల్లాలో నైట్ కర్ఫ్యూ... బార్లు రెస్టారెంట్లు మూసివేత...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  మంగళగిరి, తాడేపల్లిలో పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఈరోజు అధికారులతో సమీక్షను నిర్వహించారు.  మంగళగిరి పరిధిలో రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.  అదే విధంగా 15 రోజులపాటు నైట్ కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  బార్ అండ్ రెస్టారెంట్స్, హోటళ్లు, టీ స్టాల్స్ 15 రోజులపాటు పూర్తిగా మూసివేయించాలని అధికారులను ఎమ్మెల్యే ఆర్కే ఆదేశించారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-