అక్కడ సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు నైట్‌కర్ఫ్యూ పొడిగింపు

కరోనా కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ, నైట్‌ కర్ఫ్యూ అమలు చేశాయి.. ఇంకా కోవిడ్‌ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో… ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు.. చాలా వరకు సడలింపులు ఇచ్చినా.. మరోవైపు.. పరిస్థితులను బట్టి.. కర్ఫ్యూ, నైట్‌ కర్ప్యూ పొడిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు నైట్‌కర్ఫ్యూను పొడగించింది. ఆదివారం నుంచి వచ్చే నెల వరకు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నైట్‌కర్ఫ్యూ అమలులో ఉండనుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది… ఇక, కోవిడ్‌ కేసులు తీవ్రంగా ఉన్న కటక్‌, పూరి, భువనేశ్వర్‌లో వారాంతపు లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది.. నైట్‌కర్ఫ్యూ పొడగించినా.. ఆంక్షల నుంచి సడలింపులు ప్రకటించింది. షాపింగ్‌ మాల్స్‌, పార్కులు, సినిమా హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఒడిశా సర్కార్.

-Advertisement-అక్కడ సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు నైట్‌కర్ఫ్యూ పొడిగింపు

Related Articles

Latest Articles