మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ.. అవి మూసివేత..

కరోనా రక్కసి మరోసారి దేశంలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోజురోజు భారీగా నమోదవుతున్నాయి. గత వారం రోజుల క్రితం దేశవ్యాప్తంగా రోజుకు 50 వేల లోపు నమోదవుతున్న కరోనా కేసులు సంఖ్య తాజాగా లక్షన్నరకు చేరువలో నమోదవుతున్నాయి. దీనిబట్టే అర్థచేసుకోవచ్చు కరోనా ఏ రేంజ్‌లో వ్యాప్తి చెందుతుందోనని. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

కేవలం ముంబాయిలోనే 20వేలకుపైగా కేసులు నమోదుకాగా, మహారాష్ట్ర మొత్తం మీద 40 వేలపై చిలుకు కరోనా కేసులు నమోదువతున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా విద్యాసంస్థలకు ఫిబ్రవరి 15 వరకు సెలవులు ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5గంటల వరకు ఈ నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే స్పాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, సెలూన్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు తదుపరి ఆదేశాలిచ్చేదాకా మూసివేయాలని ఆదేశించారు.

Related Articles

Latest Articles