ఆ రాష్ట్రంలో మళ్లీ నైట్ క‌ర్ఫ్యూ…రాత్రి 8 గంటల వ‌ర‌కు…

దేశంలో ఒక‌వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా అమలు జరుగుతున్నా క‌రోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు.  పైగా కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండ‌టంతో కొన్ని రాష్ట్రాల్లో మ‌ర‌లా ఆంక్ష‌లు మొద‌ల‌య్యాయి.  నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చిరిస్తున్నాయి. కేర‌ళ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో కూడా నైట్ క‌ర్ఫ్యూను విధిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు షాపులు, రెష్టారెంట్లు, వ్యాపార స‌ముదాయాలు మూసివేయాల‌ని ఆదేశించింది.  రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూసే ఉంటాయ‌ని, త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు తెర‌వ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.  రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  

Read: గ్యాస్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై రాహుల్ గాంధీ ఆగ్ర‌హం…

Related Articles

Latest Articles

-Advertisement-