‘హరిహర వీరమల్లు’ స్టోరీ లీక్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ

టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇకపోతే ఇటీవల నిధి అగర్వాల్ నటించిన ‘హీరో’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిధి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ఈ సినిమా తరువాత నిధి పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ జరుపుకోంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పవన్, నిధి పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఇక తాజాగా నిధి పవన్ గురించి, సినిమా గురించి మాట్లాడుతూ ఒక కీలక విషయాన్ని రివీల్ చేసింది.

పవన్ తో నటించడం తన అదృష్టమని, వీలుంటే రెండోసారి కూడా ఆయనతో నటించడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ఇక ‘హరిహర వీరమల్లు’ రెండు టైం జోన్లలో నడిచే కథ అని, ఒకటి పురాతన కాలంలో మరొకటి ఈ కాలంలో నడుస్తుందని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా పూర్తిగా చారిత్రాత్మకంగా ఉండబోతుందని, పవన్ సినిమా మొత్తం వీరమల్లు లానే కనిపిస్తాడని అనుకున్నారు. కానీ, ఇప్పుడు నిధి చెప్పిన ప్రకారం పవన్ రెండు గెటప్పులో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు క్రిష్, చిత్ర యూనిట్ రివీల్ చేయని సీక్రెట్ ని నిధి లీక్ చేయడంపై అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి క్రిష్ ఈ సినిమాను ఏ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నాడో చూడాలి.

Related Articles

Latest Articles