ఆ సమయంలో కళ్లు తెరవడం చాలా కష్టం: నిధి అగర్వాల్

తెలుగులో సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాల్లో నటించిన బ్యూటీ నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ తో విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె గల్లా అశోక్‌ సరసన సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ఇక నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ‘హరి హర వీరమల్లు’లో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే, తాజాగా నిధి ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు తెలిపింది. ‘వర్షం పాటల్లో నటించడం అంత తేలిక కాదని, చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో తడవడం, విరామంలో ఆరడం, మళ్లీ షూటింగ్​లో తడవడం చాలా కష్టమని తెలిపింది. పై నుంచి నీళ్లు పడుతుంటే కళ్లు తెరుచుకుని ఉండాలంటే నా వల్ల కాదని చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పట్లో రెయిన్ సాంగ్స్​ చేయడం గురించి ఆలోచించడం లేదు’ అని నిధి అగర్వాల్ తెలిపింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-