‘మాచర్ల నియోజకవర్గం’లో నిధి!

టాలీవుడ్ నటుడు నితిన్ నటించిన ‘మాస్ట్రో’ సినిమా నేడు ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకొంది. రీమేక్ చిత్రమైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇదిలావుంటే, నితిన్‌ కథానాయకుడిగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకోగా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. అయితే మరో కథానాయికగా నిధి అగర్వాల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమెను సంప్రదించి ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మహతి స్వరసాగర్‌ సంగీతాన్ని అందించనున్నారు.

సవ్యసాచి, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు నిధిని నిరాశపరచగా, ఇస్మార్ట్ శంకర్ హిట్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొంది. ఇక ఈ బ్యూటీ అందాల ఆరబోతకు భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాలోను నిధి నటిస్తోన్న విషయం తెలిసిందే.

-Advertisement-‘మాచర్ల నియోజకవర్గం’లో నిధి!

Related Articles

Latest Articles