నిధికి ఫిదా అయిన స్టార్ డైరెక్టర్?

కృషి ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారు! కానీ, నిధి అగర్వాల్ కృషితో పాటూ క్రిష్ ని కూడా నమ్ముకుంటోంది! మన టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఇస్మార్ట్’ బ్యూటీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యాడట. తనని మరికొన్ని సినిమాలకి కూడా రికమెండ్ చేస్తున్నాడట. అందుక్కారణం నిధి అగర్వాల్ అందం ఒక్కటి మాత్రమే కాదు. పవర్ స్టార్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది నిధి. ఆ పీరియాడికల్ మూవీకి డైరెక్టర్ క్రిష్ అన్న సంగతి తెలిసిందే కదా! చారిత్రక చిత్రంలో నిధి చక్కగా నటిస్తోందట. అందుకే, టాలెంటెడ్ బ్యూటీని క్రిష్ ఎండార్స్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్!
బాలీవుడ్ టూ తమిళం దాకా వివిధ భాషల్లో నిధి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కోలీవుడ్ లో కూడా ఈ బబ్లీ బ్యూటీ బాగానే క్రేజ్ పెంచుకుంటోంది. ఇక హిందీలో కెరీర్ ప్రారంభంలోనే సినిమాలు చేసినా ఇప్పుడు పెద్దగా ముంబై వైపు చూపు సారించటం లేదు. తెలుగులో మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తరువాత, కెరీర్ కి ఆశించినంత ఊపు రాకపోయినప్పటికీ ఇప్పుడు పీకే మూవీలో పర్పామెన్స్ కి ఛాన్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తుండటంతో నిధి గురించిన చర్చ ఇండస్ట్రీలో పెరుగుతోంది. చూడాలి మరి, క్రిష్ పీరియాడికల్ మూవీ నిధి అగర్వాల్ కి ఎలాంటి జోష్ ని ఇస్తుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-