నల్ల కోకలో నిధులు.. ఎంత దాచినా దాగనట్టున్నాయ్

సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమర్ రాజా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై జయదేవ్ గల్లా- పద్మ గల్లా సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక ఇటీవలే సంక్రాంతి బరిలోకి దిగిన హీరో.. ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ నల్ల కొక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. హాఫ్ షోల్డర్ డిజైనర్ బ్లౌజ్ పై పలుచని బ్లాక్ శారీలో నిధి దేవ కన్యనే తలపించింది.

ఇక అమ్మడి బొద్దు అందాలు ఎంత దాచినా దాగను అనేలా కనిపించేస్తున్నాయి. ఆ నల్లటి చీరలో తెల్లటి మృదువైన నిధి దేహం పాలరాతిలా మెరిసిపోతుంది. ఇక ఆ గరిమ నాభికి కుర్రాళ్ళ మతులు పోవాల్సిందే. ప్రస్తుతం అమ్మడి నల్లకోక అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఈ ఈవెంట్ లో నిధి మాట్లాడుతూ” అశోక్ కొత్తవాడే అయినా అనుభవం ఉన్నవాడిలా నటించాడు ప్రతిదీ నేర్చుకొని సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అంటూ చెప్పుకొచ్చింది”. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమాతో ఈ ‘హీరో’ హీరోయిన్ కి ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

Related Articles

Latest Articles