‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అంటున్న నిధి అగర్వాల్

కరోనా కష్టకాలంలో తన వంతుగా కోవిడ్ బాధితులకు సాయం చేసేందుకు సినిమా సెలెబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. కోవిడ్ సంబంధిత అన్ని సహాయాలను అందించేలా ఈ సంస్థ నడుస్తుందని, సాయం అవసరమున్న ప్రతి ఒక్కరు ఈ వెబ్ సైట్ కు రిక్వెస్ట్ లు పెట్టొచ్చని ఆమె పేర్కొంది. అలా వచ్చిన అభ్యర్థనలు పరిశీలించి సాయం చేసేందుకు ఓ టీమ్ పని చేస్తుందని చెప్పింది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రాథమిక అవసరాలైన మందులు, ఆహారం లాంటివి అందిస్తామని తెలిపింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-