కేరళ గోల్డ్ స్కాం.. సూత్రధారి అరెస్ట్‌

సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కాంలో సూత్రధారి మహమ్మద్ మన్సూర్‌ను అరెస్ట్ చేసింది ఎన్‌ఐఏ.. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. గత ఏడాది జూలై 5న త్రివేండ్రం ఎయిర్ పోర్ట్‌లో 30 కిలోల బంగారం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకోగా.. దుబాయ్ నుండి మహమ్మద్ మన్సూర్ మొత్తం స్కాంను నడిపినట్లు గుర్తించారు. ఇతర నిందితులతో కలిసి బంగారాన్ని భారత్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశాడు మన్సూర్.. తిరువనంతపురoలో ఉన్న యూఏఈ కన్సులెట్ అడ్రస్ కు కార్గో ద్వారా గోల్డ్ స్మగ్లింగ్ చేశాడు.. ఇవాళ ఎన్‌ఐఏ.. మన్సూర్‌ను అరెస్ట్‌ చేసింది.. కోర్టులో హాజరుపర్చగా.. 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-