రాయలసీమ ఎత్తిపోతల పథకం.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ కీల‌క ఆదేశాలు

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు వ్య‌వ‌హారం ఏపీ, తెలంగాణ మ‌ధ్య కాక‌రేపాయి.. ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు.. ఇలా చాలా వ‌ర‌కే వెళ్లింది వ్య‌వ‌హారం.. అయితే, విష‌యంలో కృష్ణా న‌ది యాజ‌మాన్య‌బోర్డుకు కీల‌క ఆదేశాలు జారీ చేసింది నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్.. సొంతంగా తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తనిఖీలకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న కృష్ణా బోర్డు నివేదనను పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇచ్చింది జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్ పర్ట్ మెంబర్ డాక్టర్ సత్యగోపాల్ తో కూడిన ఎన్జీటీ చెన్నై బెంచ్.. ఇక‌, బోర్డు నివేదిక ఆధారంగా తదుపరి ఆదేశాలు ఇస్తామ‌ని పేర్కొన్న‌ ఎన్జీటీ… త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 9వ తేదీకి వాయిదా వేసింది.

Related Articles

Latest Articles

-Advertisement-