టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. తాను ప్రజల మధ్యే ఉంటానని… ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా స్పష్టం చేశారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… తాను అక్రమంగా సంపాదిస్తున్నారని మాట్లాడితే.. మూతి పగిలిపోతుందని గాలి భానును ఉద్దేశించి హెచ్చరించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ బహిర్గతం చేస్తానని.. వైసీపీలో ఉన్నవారి అండదండలతో తనపై గెలవాలనుకుంటే పగటి కలే అవుతుందని గాలి భానుపై సెటైర్లు వేశారు.
Read Also: మీరు లేకపోతే నేను లేను: ఉద్యోగులతో సీఎం జగన్
నగరిలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీలో ఎమ్మెల్యే రోజాకు వాటా ఉందంటూ ఇటీవల గాలి భానుప్రకాష్ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అండతో నగరి సంపదను కొల్లగొడుతున్నారని.. ఆంబోతుల్లా నగరి మీద పడి దోచుకుంటున్నారంటూ విమర్శలు చేశారు. గ్రావెల్ దోపిడీకి ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారని.. నాడు తన తండ్రి ముద్దుకృష్ణమ చెన్నైకు మట్టి తరలిపోకకుండా చర్యలు తీసుకుంటే.. నేడు ఎమ్మెల్యే రోజా మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చారని గాలి భానుప్రకాష్ విమర్శించారు.