★ నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన… శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్
★ నేడు, రేపు తిరుమలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన… సాయంత్రం తిరుమల చేరుకోనున్న వెంకయ్యనాయుడు.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి
★ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని నేడు విజయవాడ ధర్నా చౌక్‌లో టీడీపీ నేత బోండా ఉమా దీక్ష.. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్న బోండా ఉమా
★ రాష్ట్ర విభజన అంశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై నిరసనలు చేపట్టాలని నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు మంత్రి కేటీఆర్ పిలుపు
★ నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు ఉపాధ్యాయ సంఘాల పిలుపు… జీవో 317కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల ధర్నా
★ బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు సింగరేణి కార్మిక సంఘాల దీక్ష
★ నేడు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ
★ కర్ణాటకలో నేటి నుంచి మూడు రోజుల పాటు విద్యాసంస్థల మూసివేత.. హిజాబ్ వివాదంతో కర్ణాటక సీఎం బొమ్మై కీలక నిర్ణయం
★ అహ్మదాబాద్: నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే… మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్