ఇవాళ ఉదయం 11 గంటలకు పోట్లదుర్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎంపీ సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం.. రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ పెద్దకర్మకు హాజరుకానున్న తెలంగాణ సీఎం
నేటి నుంచి 9 తేదీ వరకు మెదక్ లో CITU 5వ రాష్ట్ర మహాసభలు.. నేడు బహిరంగ సభకు హాజరుకానున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నేడు నిజామాబాద్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన.. జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్న మహేష్ కుమార్ గౌడ్
నేడు కర్ణాటకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఉడిపిలో శ్రీకృష్ణ మాత ఆలయాన్ని సందర్శించనున్న పవన్.. ఉదయం 10.45కి మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి కర్ణాటక వెళ్లనున్న ఏపీ డిప్యూటీ సీఎం
నేడు నిడదవోలులో పర్యాటక సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన.. సాయంత్రం 4 గంటలకు నిడదవోలు మంత్రి కార్యాలయం వద్ద ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరణ
నేడు మంగళగిరి ఆర్ఆర్ కన్వెన్షన్లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ల రాష్ట్ర సదస్సు.. సదస్సులో పాల్గొనున్న మంత్రి అచ్చెనాయుడు
నేడు గుంటూరులో ఈగల్, పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో- సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమం.. పాల్గొనున్న ఈగల్ ఐజీ రవికృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్
Also Read: Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
నేడు కోడుమూరులో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ఆధ్వర్యంలో హిందూ మహాసమ్మళనం – మహాపాదయాత్ర.. పాల్గొననున్న శ్రీ రామానుజ జీయర్ స్వామి , శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి
నేడు దక్షిణాఫ్రికా vs ఐర్లాండ్ మహిళల మధ్య రెండో టీ20.. బోలాండ్ పార్క్ వేదికగా మ్యాచ్ సాయంత్రం ఆరంభం
ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్.. నేడు కొనసాగనున్న నాలుగో రోజు