* నేడు ఉస్మానియా యూనివర్శిటీకి రేవంత్ రెడ్డి. ఓయూ వీసీని కలవనున్న రేవంత్ రెడ్డి. సభకు అనుమతి కోరనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
*నేటినుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం. భక్తుల సంఖ్యపై పరిమితి విధించిన ప్రభుత్వం
* నేడు రెండవ రోజు ప్రధాని మోడీ యూరప్ పర్యటన
*వరంగల్ లో నేటి నుండి శ్రీ భద్రకాళీ దేవాలయంలో శ్రీ భద్రకాళీ వీరభద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
*తిరుపతి రుయా ఆసుపత్రిలో నేటి నుంచి అందుబాటులోకి ప్రత్యేక ఆస్తమా క్లినిక్
*విశాఖ సింహాచలం చందనోత్సవంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్న తమిళిసై
*నేడు అశ్వారావుపేట నియోజకవర్గంలో కొనసాగనున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
*జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ లో ప్రారంభమైన నీటి ఎత్తిపోతలు. పంపుహౌస్ లోని 10,11 వ నంబర్ మోటార్లతో గ్రావీటి కాల్వలోకి నీటి పంపింగ్.
*నేడు టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకట రమణ. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్న వెంకట రమణ
*విశాఖపట్నంలోని సింహాచలం కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ. సాయంత్రం వరకు రెండు లక్షల మంది స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా.
*నెల్లూరు లోని బరా షాహిద్ దర్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
*యర్రగొండపాలెంలో రంజాన్ సందర్భంగా జామియా మసీదు వద్ద కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్.