* ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం.
*అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
* విజయవాడలో ఆయుష్ విభాగము ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. కార్యక్రమంలో పాల్గొననున్న ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ.
*అంతర్జాతీయ యోగాదినోత్సవ సందర్బంగా తిరుపతి ప్రకాశం పార్కులో స్దానికులతో కలిసి యోగా చేయనున్న జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి
*నేటి నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు తిరుచానూరులో సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు.
*ఆత్మకూరు ఉప ఎన్నికకు నేటితో ముగియనున్న ప్రచారం.
*నేడు సింహాద్రి అప్పన్న గోశాలలో ట్రస్టుబోర్డు సమావేశం. చైర్మన్ అశోకగజపతి రాజు అధ్యక్షతన 46 అంశాలపై చర్చించనున్న సభ్యులు
*హైదరాబాద్ పరేడ్ గౌండ్స్ లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నటుడు అడవి శేష్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి తదితరులు.
* విశాఖలో కేంద్ర మంత్రి ఎస్.ఠాగూర్ పర్యటన