అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. బుమ్రా, షమీ లాంటి ఫ్రంట్ లైన్ బౌలర్లు లేకపోయినా వెస్టిండీస్‌ను 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా ముందు 177 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్లుగానే భారత బౌలర్లు వెస్టిండీస్‌ను బెంబేలెత్తించారు. హోల్డర్ (57) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి అలెన్ (29) నుంచి సహకారం అందింది.
Read Also: మాజీ క్రికెటర్ సురేష్ రైనా నివాసంలో విషాదం
భారత బౌలర్లలో స్పిన్నర్ చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు సాధించాడు. ప్రసిధ్ కృష్ణకు రెండు వికెట్లు పడగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓ దశలో 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో వెస్టిండీస్‌కు ఆల్‌రౌండర్ హోల్డర్, బౌలర్ అలెన్ 8వ వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం అందించారు. దీంతో విండీస్ కోలుకున్నట్లే అనిపించింది. అయితే వెంటవెంటనే మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. కాగా టీమిండియాకు ఇది 1000వ వన్డే కావడం విశేషం.