నిన్నటి వరకు కేసీఆర్ సోనియా కాంగ్రెస్‌ని మాత్రమే తిట్టేవారని, ఇప్పుడు గరీబ్ హటావో అని పేదలను ఆదుకున్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆకలి చావులు అని తిడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా గాంధీని విమర్శిస్తే తెలంగాణలో ఏ ఒక్క మహిళా మీకు ఓటేయరన్నారు. మీకు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఇందిరా గాంధీ ని విమర్శిస్తున్నావ్ అని వీహెచ్ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ, ఇందిరా గాంధీ ని విమర్శిస్తే సహించేది లేదని, ఇందిరా గాంధీ ని విమర్శిస్తే మీ పైనా తిరగబడబడాలని తెలంగాణ మహిళలకి విజ్ఞప్తి చేస్తానన్నారు. కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు రేపటి నుండీ 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నానని ఆయన వెల్లడించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మృత్యంజయం మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
World Cup Final Loss: వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి.. బంగ్లాదేశ్‌లో సంబరాలు..!
ఎన్నికల తరువాత ఒకరోజు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా ఉండడానికి లేదని, ప్రజలు బీఆర్ఎస్ తిరస్కరిస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలి.. సమాజంలో ఉన్నా ప్రతి ఒక్క వర్గం ప్రభుత్వం కొనసాగడానికి లేదని భావిస్తున్నారు.. తెలంగాణ ఉద్యమంలో కాపల కుక్కల ఉంటా అన్నారు.. దళితులకు ముందు నుండి ద్రోహం చేస్తున్నారు.. కేసీఆర్ తెలంగాణ ద్రోహి.. హామీల నెరవేర్చకుండా కేసీఆర్ అవినీతి సామ్రాట్ అయ్యారు.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని అవినీతి కేసీఆర్ చేశారు.. రెండున్నర సంవత్సరాలుగా బీజేపీ లో ఉన్నా.. మోడీ ,అమిత్ షా కేసీఆర్ అవినీతి గురించి చెప్తారు..కాని చర్యలు తీసుకోరు.. కాని వారికి వ్యతిరేకంగా ఉన్నా కాంగ్రెస్ నేతల పై ఈడీ, ఐటీ రైడ్స్ చేసున్నారు.. రేవంత్ నేత్రుత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. బీజేపీ, బీఆరెస్ రెండు ఒకటే.. వాటిని కులగొట్టేది కాంగ్రెస్ మాత్రమే..’ అని వి.హనుమంత రావు వ్యాఖ్యానించారు.
Sajjala: అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ