Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ustaad Bhagat Singh Box Office Disaster Pawan Kalyans Film Fails To Cross %e2%82%b9100 Cr

Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Published Date :March 31, 2026 , 7:43 am
By subbarao kilari
Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’
  • Follow Us :
  • google news
  • dailyhunt

గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతటి బారి అంచనాల మధ్య మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా  బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటెంట్ బలహీనంగా ఉండటం పోటీగా వచ్చిన చిత్రాల ప్రభావంతో ఈ సినిమా కేవలం రెండు వారాలకే తన రన్‌ను ముగించే స్థితికి చేరుకుంది.

Also Read : Peddi : రామ్ చరణ్ పెద్ది వాయిదా ఫిక్స్.. అసలు కారణం ఏంటంటే

ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ. 92 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ మార్కెట్ స్టామినాతో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తం. గత ఆదివారం ఈ చిత్రం కేవలం రూ. 1.03 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టగా సోమవారం నాటికి ఆ వసూళ్లు సగానికి పైగా పడిపోయాయి. దీంతో పవర్ స్టార్ కెరీర్‌లో ఇది మరొక భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయేలా కనిపిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుండటం ‘ఉస్తాద్’కు శాపంగా మారింది. మరోవైపు ఉస్తాద్‌లో పాత కాలపు మాస్ ఫార్ములా సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ మరియు అర్బన్ సెంటర్లలో ఈ సినిమా ప్రభావం చాలా తక్కువగా ఉంది. హరీష్ శంకర్  గత సినిమాల్లోని సీన్లను గుర్తు చేసే విధంగా ఉండటం, స్క్రీన్ ప్లేలో వేగం తగ్గడం వంటి కారణాల వల్ల సామాన్య ప్రేక్షకులు ఈ సినిమాకు దూరమయ్యారు. ఫలితంగా భారీ నష్టాలతో ఉస్తాద్ భగత్ సింగ్ డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dhurandhar 2 vs Ustaad Bhagat Singh
  • Harish Shankar
  • Mythri Movie Makers
  • Pawan Kalyan Disaster
  • Pawan Kalyan Ustaad Bhagat Singh

తాజావార్తలు

  • Earthquake: అమెరికాలో భూకంపం.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు

  • Praful Hinge: 4 వికెట్స్ తీస్తానని ముందే రాసిపెట్టుకున్నా.. నేను మానిఫెస్టేషన్‌ను నమ్ముతా!

  • Longest IPL Match: “4 గంటల 23 నిమిషాలు”.. ధురందర్ 2 కంటే ఎక్కువ సేపు సాగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదే..

  • TheyCallHimOG Part : పవర్ స్టార్ OG సీక్వెల్ ఓజస్ గంభీర – రాంపేజ్ బిగిన్స్

  • 808Krishna : 19 ఏళ్ల మ్యూజిక్ సెన్సేషన్.. టాలీవుడ్ ఎంట్రీ

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions