తిరులమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసినట్టు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో ఇక నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండవని పేర్కొంది. పది రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించింది. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులును దర్శనానికి అనుమతించిన టీటీడీ. పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 3 లక్షల 77వేల 943 మంది భక్తులు. 1,22,799 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. పది రోజుల హుండీ ఆదాయం 26.6 కోట్లు అనిటీటీడీ అధికారులు తెలిపారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం రోజు శ్రీవారిని 45,481 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు చెప్పారు. శనివారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజే 15,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.