TPCC Mahesh Goud : బీజేపీ చేపట్టిన మహాధర్నాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ విషయమై మాట్లాడే అర్హత బీజేపీకి, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రానికి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల మెప్పు పొందిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Hindu Rate Of Growth: ‘‘హిందూ వృద్ధిరేటు’’పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు.. అసలేంటి ఇది..
ఇందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలే స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయిన బీజేపీ నేతలు ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేని స్థితిలో ఉందని, అలాంటి పరిస్థితిలో ఉన్న కిషన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం గర్వంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుందని, ప్రజల మద్దతుతో ప్రజల ముందే గర్వంగా నిలబడుతున్నామని చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకాల వల్ల రూ. 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అయినప్పటికీ ఒకవైపు అప్పులపై వడ్డీలు చెల్లిస్తూనే, మరోవైపు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ రాబోయే మూడేళ్లలో తప్పకుండా నెరవేర్చుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
Aamir Khan : మాజీ భార్యలపై ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. వైరల్ !