అమరావతిలోని ఎన్జీవో హోంలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే పీఆర్సీపై ప్రభుత్వంతో దేనికైనా సిద్ధం అంటూ ప్రకటనలు చేవారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇవాళ కేబినేట్ సమావేశం నిర్వహిస్తుంది. ఈ రెండు భేటీలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే సమావేశానికి హాజరైన ఉద్యోగ సంఘ నేతలు వెంకట్రామిరెడ్డి, బండి, బొప్పరాజు, సూర్యనారాయణ. సచివాలయంలో కెబినెట్ జరుగుతోన్నందున్న ఉద్యోగ సంఘ నేతల సమావేశానికి ప్రభుత్వం అనుమతించలేదు. ప్రభుత్వ అనుమతి నిరాకరణతో ఎన్జీవో హోంలో భేటీ అయిన నేతలు. సమ్మె నోటీసు ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకుంటున్నందున్న కీలకంగా మారిన ఉద్యోగ సంఘాల నేతల భేటీ.
Read Also: ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం..
ఇవాళ సమ్మె నోటీసు ఇచ్చే విధంగా కార్యచరణ: బొప్పరాజు, ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్.
ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె నోటీసు ఇచ్చేలాగానే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు బొప్పరాజు తెలిపారు. సీఎస్ సమీర్ శర్మను కలిసి నోటీసు అందజేస్తామన్నారు. ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. జీతాల బిల్లులను ప్రాసెస్ చేసేదే లేదని మా ఉద్యోగులు స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఆప్షన్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం జీతాలు ఇవ్వాలని ప్రయత్నించడం సరైంది కాదని ఉద్యోగ సంఘాల తరపున తెలుపుతున్నా అంటూ బొప్పరాజు వ్యాఖ్యానించారు.